హైలైట్స్
- మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చిన Redmi Note 12 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్
- Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లకు రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ హామీనిచ్చిన షావోమి
- భారత్ లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఖరీదైన రెడ్మీ నోట్ మోడల్ Redmi Note 12 Pro+ 5G
Redmi Note 12 Pro 5G సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 200ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బి అట్మాస్ ఆడియో తో వచ్చాయి. ఓసారి భారత్ లో Redmi Note 12 Pro 5G సిరీస్ యొక్క ధర, లాంచ్ ఆఫర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో రెడ్మీ నోట్ 12ప్రో 5జీ మరియు రెడ్మీ నోట్ 12ప్రో+ 5జీ ధర, ఆఫర్స్, లభ్యత
Redmi Note 12 Pro 5G:
- 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.21,999
- 8GB + 128GB వేరియంట్ ధర రూ.26,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.23,999
- 8GB + 256GB వేరియంట్ ధర రూ.27,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.24,999
Redmi Note 12 Pro+:
- 8GB + 256GB వేరియంట్ ధర రూ.29,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.26,999
- 12GB + 256GB వేరియంట్ ధర రూ.32,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.29,999
Redmi Note 12 Pro మరియు Redmi Note 12 Pro+ కొనుగోలుదారులు ఐసీఐసీఐ క్రెడిట్ (ఈఎంఐ మరియు నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ (ఈఎంఐ) ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే షావోమి కంపెనీ రూ.3,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఒకవేళ మీరు షావోమి లేదా రెడ్మీ స్మార్ట్ ఫోన్ లను ఎక్స్‌చేంజ్ చేస్తే మీకు రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక్కడ కొనుగోలుదారులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బ్యాంక్ డిస్కౌంట్ మరియు బంప్ అప్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లను కలగలిపి కొనుగోలు జరపలేరు. ఇకపోతే Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G ఫోన్ల అమ్మకాలు నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. ఇవాళ అనగా జనవరి 11 తేదీ నుంచి ఎంఐ స్టోర్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.