హైలైట్స్
- ఈ నెలలో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, టీజర్ పోస్టర్ ద్వారా వచ్చిన కన్ఫర్మేషన్
- ఈ లైనప్ లో వస్తున్న మోడల్స్: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Plus
- రెండు కొత్త టెక్నాలజీస్ తో వస్తున్న Redmi Note 12 సిరీస్

Redmi Note 12 సిరీస్ లాంచ్ సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అవ్వనుందని గతంలో వచ్చిన నివేదికలు స్పష్టం చేశాయి. ఇప్పుడు కంపెనీ నుంచి అధికార పోస్టర్ విడుదలైంది. దీంతో లాంచ్ ఈ నెలలోనే ఉండనుందని స్పష్టమైంది. అయితే ఈ పోస్టర్ లో లాంచ్ తేదీ రివీల్ కాలేదు. పోస్టర్ లో “ఈ నెలలో కలుసుకుందాం” అని రాసి ఉంది.
Redmi Note 12 లాంచ్ టీజర్
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Redmi Note 12 లాంచ్ టీజర్ పోస్టర్ ని తొలుత గమనించాడు. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో ద్వారా ఈ పోస్టర్ బయటకు వచ్చింది. Redmi Note 12 సిరీస్ ఈ నెలలో లాంచ్ అవ్వనుందన్న విషయంతో పాటు, రెండు కొత్త టెక్నాలజీలతో వస్తున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమైంది. మరి ఈ వరల్డ్-ఫస్ట్ టెక్నాలజీస్ ఏంటో ఇంకా మనకు తెలియదు. మరి ఇటీవలి కాలంలో లీకైన సమాచారాన్ని బట్టి Redmi Note 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Redmi Note 12 సిరీస్ స్పెసిఫికేషన్స్
Redmi Note 12 లైనప్ లో Redmi Note 12, Redmi Note 12 Pro, మరియు Redmi Note 12 Pro+ మోడల్స్ ఉంటాయని అంతా భావిస్తున్నారు. వీటికి తోడు, Redmi Note 12 Pro Extreme Edition కూడా ఉంటుందని లీకైన లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. లాంచ్ తర్వాత గానీ పూర్తి క్లారిటీ వచ్చేలా లేదు.
Redmi Note 12 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. డైమెన్సిటీ 1300 లేదా ఇంకేదైనా 6ఎన్ఎం చిప్సెట్ వాడే అవకాశం ఉంది. ఈ ఫోన్లు 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే బ్యాటరీ కెపాసిటీస్ వివరాలు ఇంకా తెలియలేదు. రెడ్మీ నోట్ 12 లేదా నోట్ 12 ప్రో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
Redmi Note 12 Pro+ 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు షావోమీ నుంచి 200 వాట్+ ఫాస్ట్ చార్జింగ్ కి సంబంధించిన టీజర్ పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. దీన్ని బట్టి రెడ్మీ 12 సిరీస్ లోని ప్రో వర్షన్ లో 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనుందని అంచనా వేస్తున్నారు.
ఇక డిజైన్ గురించి మాట్లాడితే Redmi Note 12 సిరీస్ కి షావోమీ పెద్దగా మార్పులు చేసే విధంగా కనిపించడం లేదు. కంపెనీ యొక్క EVOL డిజైన్ లాంగ్వేజీనే ఫాలో అయ్యే అవకాశం ఉంది. మార్పులు ఏవైనా ఉంటే అవి సాఫ్ట్వేర్ పరంగా తీసుకునేవే అయి ఉంటాయి. ప్రస్తుతం Redmi Note 11 Pro+ ప్రస్తుత లైనప్ లో హైఎండ్ డివైజ్ గా కొనసాగుతోంది. ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ని కలిగి ఉంది. Redmi Note 12 సిరీస్ ప్రాసెసర్, కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ విభాగాల్లో అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












