108ఎంపి కెమెరా, హీలియో జీ96 చిప్‌తో పోలాండ్ లో లాంచైన Redmi Note 12S

Highlights

  • గ్లోబల్ మార్కెట్ లో లాంచైన Redmi Note 12S
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Redmi Note 12S ధర 1,499 పోలిష్ జ్లోటీలు (సుమారు రూ.29,500)

గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా ఎన్నో Redmi Note 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన రెడ్మీ సంస్థ, తాజాగా Redmi Note 12S డివైజ్ ని పోలాండ్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ96 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

Redmi Note 12S ఒక 4జీ స్మార్ట్ ఫోన్. దీన్ని పోలాండ్ లో లాంచ్ చేశారు. అయితే భారత మార్కెట్ లాంచ్ టైమ్‌లైన్ ఇంకా తెలియలేదు. సరే, ఓసారి Redmi Note 12S డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 12S ధర, డిజైన్, కలర్స్

  • Redmi Note 12S స్మార్ట్ ఫోన్ 8జిబి+256జిబి వేరియంట్ ధర 1499 పోలిష్ జ్లాటీలు (సుమారు రూ.29,500) గా ఉంది.
  • Redmi Note 12S డిజైన్ విషయానికి వస్తే, పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి.
  • ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి.
  • డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో ప్రైమరీ సెన్సర్, రెండు రెగ్యులర్ కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ప్యానెల్ పై రెడ్మీ బ్రాండింగ్ ఉంది.
  • ఒనిక్స్ బ్లాక్, ఐస్ బ్లూ మరియు పెర్ల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Redmi Note 12S స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 90 హెర్ట్జ్ డిస్ప్లే
  • అమోలెడ్ ప్యానెల్

Redmi Note 12S స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్, స్టోరేజీ, ర్యామ్

  • హీలియో జీ96
  • 256జిబి స్టోరేజీ
  • 8జిబి ర్యామ్

Redmi Note 12S స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ96 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి. 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్, 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఆప్షన్ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ, కనెక్టివిటీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Redmi Note 12S డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. స్టీరియో స్పీకర్, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వై-ఫై, 4జీ, డ్యూయల్ సిమ్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Redmi Note 12S స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు.

వెయిట్, డైమెన్షన్స్

  • 176 గ్రాములు
  • 8.09 ఎంఎం

Redmi Note 12S స్మార్ట్ ఫోన్ 159.87 మిల్లీ మీటర్ల పొడవు, 73.87 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.09 మిల్లీ మీటర్ల మందం, 176 గ్రాముల బరువు ఉంటుంది.