
షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ గతేడాది మే నెలలో చైనాలో Redmi Note 11T Pro ని లాంచ్ చేసింది. తాజాగా దీని సక్సెసర్ Redmi Note 12T Pro లాంచ్ ని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. రెడ్మీ సంస్థ డివైజ్ డిజైన్ తో పాటు ప్రధాన హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. Redmi Note 12T Pro హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ తో వస్తోంది. ఇక ఫోన్ డిజైన్ మిగతా నోట్ 12 మోడల్స్ మాదిరే ఉంది.
ఈ Redmi Note 12 సిరీస్ ఫోన్ తాజాగా గీక్బెంచ్ ప్లాట్ఫామ్ పై కనిపించింది. ఇది Redmi Note 12T Pro అని భావిస్తున్నారు. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ మోడల్ నంబర్ (2305RA19C) తో పాటు, ప్రధాన స్పెసిఫికేషన్స్ కనిపించాయి.
గీక్ బెంచ్ పై కనిపించిన Redmi Note 12T Pro
- Redmi Note 12T Pro సింగిల్-కోర్ టెస్ట్ లో 1224 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3921 పాయింట్లు సాధించింది.
- Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 12జిబి ర్యామ్ మరియు ఇతర ర్యామ్ ఆప్షన్స్ ఉండనున్నాయి.
- మదర్బోర్డ్ విభాగంలో పెర్ల్ అనే కోడ్ నేమ్ ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ కోడ్ అని భావిస్తున్నారు. ఇదే చిప్సెట్ తో ఇటీవల Xiaomi CIVI 3 ఫోన్ లాంచ్ అయ్యింది.
Redmi Note 12T Pro డిజైన్, ఫీచర్స్
- Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ లో రెక్టాంగ్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- వాల్యూమ్ రాకర్, పవర్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
- ఐఆర్ బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్స్ టాప్ లో ఉన్నాయి.
- Redmi Note 12T Pro బ్లాక్, గ్రేడియంట్ బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- టీజర్ ద్వారా Redmi Note 12T Pro డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, జెఎన్డీసీ లేయర్, 20.5:9 యాస్పెక్ట్ రేషియో, డీసీ డిమ్మింగ్, ఐ కంఫర్ట్ మోడ్ మరియు సన్లైట్ మోడ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.













