Xiaomi సబ్-బ్రాండ్ Redmi కొన్ని రోజుల క్రితం భారత్ లో Redmi Note 13 5G సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో 3 ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా ఈ కంపెనీ గ్లోబల్ గా Redmi Note 13 4G సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Redmi Note 13 4G మరియు Redmi Note 13 Pro 4G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఓసారి Redmi Note 13 4G మరియు Redmi Note 13 Pro 4G డివైజెస్ యొక్క ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Redmi Note 13 4G ధర
- Redmi Note 13 4G సిరీస్ యురోపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.
- Redmi Note 13 4G డివైజ్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.
- అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
- Redmi Note 13 4G డివైజ్ ప్రారంభ ధర రూ.20,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- Redmi Note 13 4G స్మార్ట్ఫోన్ మిడ్నైట్ బ్లాక్, మింట్ గ్రీన్, ఐస్ బ్లూ మరియు ఓషన్ సన్సెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Redmi Note 13 4G డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియదు.
Redmi Note 13 Pro 4G ధర
- Redmi Note 13 Pro 4G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది.
- Redmi Note 13 Pro 4G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 313 యూరోలు (సుమారు రూ.28,999) గా ఉంది.
- Redmi Note 13 Pro 4G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 350 యూరోలు (సుమారు రూ.31,599) గా ఉంది.
- Redmi Note 13 Pro 4G డివైజ్ యురోపియన్ మార్కెట్ లో మిడ్నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్ మరియు ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Redmi Note 13 Pro 4G భారత్ కి వస్తుందో లేదో ఇంకా తెలియదు.
Redmi Note 13 4G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Redmi Note 13 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ వాడారు. ఈ చిప్ యొక్క క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్ గా ఉంది.
- ఓఎస్: Redmi Note 13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Redmi Note 13 4G లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Redmi Note 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 4G లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ54 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Redmi Note 13 Pro 4G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Redmi Note 13 Pro 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5, 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 Pro 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
- ఓఎస్: Redmi Note 13 Pro 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro 4G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 12జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
- కెమెరా: Redmi Note 13 Pro 4G లో 200ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Redmi Note 13 Pro 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 4G లో ఐపీ54 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్సీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.2 ఉన్నాయి.
