ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ అయిన Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ భారత మార్కెట్ లాంచ్ కోసం రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13, Note 13 Pro డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్ల గ్లోబల్ వేరియంట్స్ తాజాగా ఐఎండీఏ వెబ్ సైట్ పై కనిపించాయి.
Redmi Note 13 సిరీస్ ఇప్పటికే భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్సైట్ తో పాటు విదేశాలకు చెందిన గీక్‌బెంచ్, 3సీ, టీఈఎన్ఏఏ, ఐఎంఈఐ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. తాజాగా ఐఎండీఏ వెబ్ సైట్ పై కనిపించింది.
IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Redmi Note 13 సిరీస్ గ్లోబల్ వేరియంట్స్
ఐఎండీఏ వెబ్ సైట్ పై 2312DRAABG అనే మోడల్ నంబర్ తో Redmi Note 13 5G డివైజ్ కనిపించింది. మరోవైపు Redmi Note 13 Pro 2312DRA50G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ రెండు ఫోన్లు ఐఎండీఏ వెబ్సైట్ పై కనిపించడంతో వీటి గ్లోబల్ లాంచ్ సమీపంలోనే ఉందని అర్థమవుతోంది.
Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు పిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G డివైజ్ ఐపీ54 వాటర్, డస్ట్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది.
Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Note 13 Pro లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Redmi Note 13 Pro లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
