Xiaomi సబ్-బ్రాండ్ Redmi జనవరి 4వ తేదీన Note 13 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G. తాజాగా Redmi Note 13 Pro 5G డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్బెంచ్ పై లిస్ట్ అయ్యిందని MySmartPrice తన కథనంలో తెలిపింది. ఇక గీక్బెంచ్ లిస్టింగ్ ద్వారా Redmi Note 13 Pro 5G కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
గీక్బెంచ్ పై కనిపించిన Redmi Note 13 Pro 5G
- Redmi Note 13 Pro 5G ఇండియన్ వేరియంట్ గీక్బెంచ్ పై 2312DRA50I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Redmi Note 13 Pro 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
- Redmi Note 13 Pro 5G డివైజ్ గీక్బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1030 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2851 పాయింట్లు స్కోర్ చేసింది.
- Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్ తో రానున్నట్లు గీక్బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
Redmi Note 13 Pro 5G స్పెసిఫికేషన్స్ (చైనా)
- డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
- మెమొరీ: Redmi Note 13 Pro 5G లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.
