షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలోనే Note 13 సిరీస్ ని భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ ఇదివరకే చైనాలో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఐఎండీఏ, బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యాయి. ఈలోపు Redmi Note 13 Pro+ 5G డివైజ్ FCC సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ర్యామ్, స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Redmi Note 13 Pro+ 5G FCC లిస్టింగ్ వివరాలు
- Redmi Note 13 Pro+ 5G డివైజ్ ఎఫ్సీసీ లిస్టింగ్ లో 23090RA98G అనే మోడల్ నంబర్ తో ఉంది.
- గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ 3 ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- బేస్ మోడల్ 8జిబి+256జిబి, టాప్ మోడల్స్ 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించవచ్చు.
- Redmi Note 13 Pro+ 5G డివైజ్ ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
Redmi Note 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (చైనా)
- డిస్ప్లే: Redmi Note 13 Pro+ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
