
షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని జనవరి 4 వ తేదీన లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు, షావోమి Redmi Note 13 Pro+ 5G లాంచ్ ని కూడా ఖరారు చేసింది. లైనప్ లోని ఇతర డివైజెస్ తో పాటే Redmi Note 13 Pro+ 5G కూడా జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా X ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇప్పటికే Redmi Note 13 Pro+ 5G డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. దీంతో Redmi Note 13 Pro+ 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. చైనీస్ వేరియంట్ మాదిరి స్పెసిఫికేషన్స్ ఇండియన్ వేరియంట్ లోనూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఓసారి చైనా వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
When top-notch specs meet unparalleled sophistication, introducing #RedmiNote13 Pro+ 5G.
The #SuperNote that can do it all, get ready to redefine luxury and innovation.
Arriving on 4th January'24.
Get Note-ified: https://t.co/ARMHn4Eb7L pic.twitter.com/Vlivj8CAiD
— Xiaomi India (@XiaomiIndia) December 14, 2023
Redmi Note 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Note 13 Pro+ డివైజ్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











