లాంచ్‌కి ముందు లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, స్టోరేజీ వేరియంట్స్

Highlights

  • జనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 5G సిరీస్
  • తాజాగా లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర
  • రివీలైన Redmi Note 13 5G సిరీస్ వేరియంట్స్

Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల కోసం రెడ్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చైనాలో లాంచైన ఈ సిరీస్ జనవరి 4వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. దీంతో లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, వేరియంట్స్ సమాచారం బయటకు వచ్చాయి. బాక్స్ ధరను లియాండర్ అనే X యూజర్ షేర్ చేశారు. బాక్స్ ద్వారా ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ ధర, స్టోరేజీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ (అంచనా)

  • లేటెస్ట్ లీక్ ప్రకారం, Redmi Note 13 5G సిరీస్ లోని స్టాండర్డ్ వేరియంట్ ప్రిజమ్ గోల్డ్, ఆర్క్‌టిక్ వైట్ మరియు స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంటుంది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ కోరల్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఆర్క్‌టిక్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.28,999 గా ఉంటుందని సమాచారం.
  • Redmi Note 13 Pro+ 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.
  • Redmi Note 13 Pro+ 5G డివైజ్ ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ బ్లాక్ మరియు ఫ్యూజన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ డెప్త్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.