Home News Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights
  • Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల పై డిస్కౌంట్
  • గతేడాది లాంచైన నోట్ 13 5జీ సిరీస్
  • సిరీస్ ప్రారంభ ధర రూ.15,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కొన్ని రోజుల క్రితం Redmi Note 13 5G అనే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Xiaomi 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా Redmi Note 13 5G సిరీస్ లోని ఫోన్ల ధరను షావోమి తగ్గించింది. దీంతో ఈ సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర ప్రస్తుతం రూ.15,499 గా ఉంది. ఓసారి ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G ధర తగ్గింపు

Redmi Note 13 5G సిరీస్ లోని అన్ని ఫోన్ల ధరలను షావోమి తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత Redmi Note 13 Pro 5G ధర రూ.21,999 గా ఉంది. Pro+ ధర రూ.27,999 గా ఉంది.

షావోమి ఐసీఐసీఐ బ్యాంక్ తో జట్టు కట్టి, అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ/నాన్-ఈఎంఐ లావాదేవీలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

Redmi Note 13 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎంఐ.కామ్, షావోమి హోమ్ మరియు షావోమి రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 13 Pro సిరీస్ లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఐపీ68 రేటింగ్, 200ఎంపి కెమెరాలు ఉన్నాయి.

Redmi Note 13 లో ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, 100ఎంపి కెమెరా, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.