Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 13 Turbo అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఇంకా లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్ వివరాలు బయటకు రాలేదు. అయితే తాజాగా, రెడ్మీ జీఎమ్ Redmi Note 13 Turbo ఫోన్ ఇమేజ్ ని షేర్ చేశారు. దీంతో డివైజ్ యొక్క ఫస్ట్ లుక్, డిజైన్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
Redmi Note 13 Turbo ఇమేజ్
Redmi Note 13 Turbo స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌ని రెడ్మీ కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ టెంగ్ థామ్సన్ షేర్ చేశారు.
థామ్సన్ Redmi Note 13 Turbo యొక్క ఫ్రంట్ లుక్ ని ఓ వీడియో ద్వారా రివీల్ చేశారు. డివైజ్ ని గమనిస్తే, ఇందులో ముందు వైపు పంచ్-హోల్ నాచ్, ఫ్లాట్ ప్యానెల్ ఉన్నాయి.
Redmi Note 13 Turbo డివైజ్ యొక్క స్క్రీన్ బెజెల్స్ లేకుండా, బాటమ్ లో సన్నని చిన్ తో కనిపిస్తోంది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
ఇప్పుడు Redmi Note 13 Turbo యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Redmi Note 13 Turbo స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Redmi Note 13 Turbo లో 6.78-ఇంచ్ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 Turbo లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- ఓఎస్: Redmi Note 13 Turbo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
- బ్యాటరీ: Redmi Note 13 Turbo లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- కనెక్టివిటీ: Redmi Note 13 Turbo లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
