ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో నోట్ 14 సిరీస్ లాంచ్ కానుంది. ఇందులో భాగంగా Redmi Note 14, Redmi Note 14 Pro మరియు Redmi Note 14 Pro+ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Redmi Note 14 Pro వేరియంట్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Redmi Note 14 Pro బీఐఎస్ లిస్టింగ్ వివరాలు
Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ ప్లాట్ఫామ్ పై 24094RAD4I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
మోడల్ నంబర్ లోని ఐ లెటర్ ఇండియన్ వేరియంట్ ను సూచిస్తోంది. కొన్ని వారాల్లో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది.
కొన్ని రోజుల క్రితం Redmi Note 14 Pro డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై ఇదే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది.
Redmi Note 13 సిరీస్ కు సక్సెసర్ గా Redmi Note 14 సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.
Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.
ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.
