
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi త్వరలో తన తదుపరి నోట్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi Note 14 Pro మరియు Redmi Note 14 Pro+ అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు చైనాలో సెప్టెంబర్ 26వ తేదీన లాంచ్ అవుతున్నాయి. తర్వాత భారత్ లో లాంచ్ అవుతాయి. ఇండియా లాంచ్ తేదీ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Redmi Note 14 Pro స్పెసిఫికేషన్స్
చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై టిప్‌స్టర్ రెడ్మీ నోట్ 14 ప్రో వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు. ఓసారి అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.
డిస్ప్లే: Redmi Note 14 Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
చిప్సెట్: Redmi Note 14 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.
ర్యామ్, స్టోరేజీ: Redmi Note 14 Pro డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
రియర్ కెమెరా: Redmi Note 14 Pro లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లేదా డెప్త్ సెన్సర్ ఉండే అవకాశం ఉంది.
ఫ్రంట్ కెమెరా: Redmi Note 14 Pro లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం. గత మోడల్ కూడా ఈ సెన్సర్ తోనే వచ్చింది.
బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 14 Pro డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
ఇతర ఫీచర్లు: Redmi Note 14 Pro డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. గత మోడల్ ఐపీ54 రేటింగ్ తో వచ్చింది.
Redmi Note 14 Pro+ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi Note 14 Pro+ లో 6.67-ఇంచ్ 1.5కే డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్ ఉంటాయి. రిఫ్రెష్ రేట్ మరియు బ్రైట్నెస్ వివరాలు ఇంకా తెలియదు.
చిప్సెట్: Redmi Note 14 Pro+ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని సమాచారం.
రియర్ కెమెరా: Redmi Note 14 Pro+ డివైజ్ లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 14 Pro+ డివైజ్ 6200 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని సమాచారం. గత మోడల్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
ఇతర ఫీచర్లు: Redmi Note 14 Pro+ స్మార్ట్‌ఫోన్ ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్ వంటి ఫీచర్లతో రానుంది. త్వరలోనే ఇండియా లాంచ్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.











