Home News 70-ఇంచెస్ 4K LED స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన Redmi

70-ఇంచెస్ 4K LED స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన Redmi

హైలైట్స్

చౌకైన మరియు అన్ని ఫీచర్లతో కూడిన వాల్యూ ఫర్ మనీ టీవీలుగా రెడ్మీ బ్రాండ్ టీవీలకు పేరుంది. భారత్ లో రెడ్మీ టీవీలకు మాంచి గిరాకీ ఉంది. షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ పట్ల జనాలకు గట్టి నమ్మకమే ఉంది. తాజాగా రెడ్మీ కంపెనీ Redmi Smart TV A70 పేరుతో ఒక టీవీని చైనాలో లాంచ్ చేసింది. 70-ఇంచ్ డిస్ప్లే ఉండటం ఈ టీవీ ప్రత్యేకత. ఈ టీవీ 4కే రెజుల్యూషన్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జిబి ర్యామ్, మెటల్ బాడీ డిజైన్ తో వస్తోంది.

Redmi Smart TV A70 టీవీలో హైలైట్ ఏంటంటే దీని ధర. కేవలం రూ.35,000 ధరలో అన్ని ఫీచర్లతో కూడిన భారీ సైజు డిస్ప్లే గల టీవీని తీసుకురావడం రెడ్మీకే చెల్లింది. ఇంక జనాలు ఈ టీవీని వదులుతారా చెప్పండి? ఇక ఈ టీవీలో 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్ ఉంది. అలాగే వాయిస్ కంట్రోల్, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్రొజెక్షన్ వంటి ఎన్నో స్మార్ట్ ఫీచర్లకు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.

Redmi Smart TV A70 ధర, లభ్యత

Redmi Smart TV A70 ధర RMB 2,999 (సుమారు రూ.35,000) గా ఉంది. ప్రస్తుతం ఈ టీవీ చైనాలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. భారత్ లో లాంచ్ కి సంబంధించిన వివరాలను పేరెంట్ కంపెనీ షావోమీ ఇంకా వెల్లడించలేదు. అయితే, గత లాంచెస్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, గ్లోబల్ మార్కెట్స్ లో ఈ టీవీ ఎంట్రీ చాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. షావోమీకి భారత మార్కెట్ అత్యంత కీలకమని తెలిసిందే. కాబట్టి త్వరలోనే భారత గడ్డపై ఈ టీవీ అడుగు పెట్టే అవకాశం ఉంది.

Redmi Smart TV A70 స్పెసిఫికేషన్స్

Redmi Smart TV A70 లో 70-ఇంచ్ డిస్ప్లే, 4కే (3840*2160 పిక్సెల్స్) రెజుల్యూషన్, 5,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. టీవీలో అల్ట్రా-న్యారో బెజెల్స్ ఉన్నాయి. దీంతో 96% స్క్రీన్-టు-బాడీ రేషియో సాధ్యమైంది. ఈ రెడ్మీ టీవీ 10-బిట్ డిస్ప్లే ప్యానెల్ కలిగి ఉంది. ఈ డిస్ప్లే 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi Smart TV A70 లో క్వాడ్ కోర్ కార్టెక్స్ ప్రాసెసర్, మాలి జీపీయూ వాడటం జరిగింది. ఈ టీవీ 1.5జిబి ర్యామ్, 8జిబి స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ టీవీ పని చేస్తుంది.

Redmi Smart TV A70 టీవీ 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్ తో వస్తోంది. బేస్ ఎన్హాన్స్‌మెంట్ కోసం డ్యూయల్ ఎయిర్ డక్ట్స్ ఈ టీవీలో ఉన్నాయి. అయితే కేవలం 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్ అంటే చాలా మందికి ఇదొక డిసపాయింట్మెంట్ అనే చెప్పాలి. 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, 2 హెచ్డీఎంఐ, 2 యూఎస్బీ పోర్ట్స్, ఈథర్నెట్, ఎస్/పీడీఐఎఫ్, ఏవీ ఇన్‌పుట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ టీవీలో ఉన్నాయి.

Redmi Smart TV A70 వాయిస్ కంట్రోల్, టీవీ స్క్రీన్ షాట్స్, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్రొజెక్షన్ వంటి ఎన్నో ఫీచర్లనను కలిగి ఉంది. యాప్ స్టోర్, మిజియా హోమ్, హెచ్డీ ప్లేయర్, టీవీ బట్లర్, క్యాలెండర్, వెదర్ వంటి ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఈ టీవీలో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.