Fire OS 7 తో మార్చి 14 న లాంచ్ కానున్న కొత్త Redmi Smart TV

Highlights

  • మరికొన్ని రోజుల్లో భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న కొత్త Redmi Smart TV
  • మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్ తో వస్తోన్న Redmi Smart TV
  • బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, ఎయిర్‌ప్లే, మిరాకాస్ట్ వంటి ఫీచర్లతో వస్తోన్న Redmi Smart TV

Xiaomi యొక్క సబ్-బ్రాండ్ అయిన Redmi భారత మార్కెట్ లో ఒక కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నేడు తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ పై Redmi సంస్థ కొత్త Redmi Smart TV ని టీజ్ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Amazon కూడా Redmi Smart TV కి సంబంధించిన ఒక ప్రోమో పేజీని వదిలింది. దీంతో Redmi Smart TV యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ రివీల్ అయ్యాయి.

Amazon లిస్టింగ్ ప్రకారం, Redmi Smart TV భారత్ లో మార్చి 14 న లాంచ్ అవుతోంది. త్వరలో రాబోవు Redmi Smart TV Fire OS 7 తో వస్తోంది.

మార్చి 14 న లాంచ్ అవుతోన్న Redmi Smart TV

Amazon లిస్టింగ్ ప్రకారం, Redmi Smart TV మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్ తో వస్తోంది. ఈ టీవీ ఇంప్రెసివ్ ఆడియో అనుభూతిని అందించనుంది. ఈ కొత్త టీవీ బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ తో వస్తుండటం విశేషం. ఇంకా డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, మిరాకాస్ట్, ఎయిర్‌ప్లే సపోర్ట్ వంటివి ఈ టీవీలో ఉంటాయి.

పైన పేర్కొన్నట్టుగా Redmi Smart TV Fire OS 7 వర్షన్ తో వస్తోంది. ఇప్పటి వరకు రెడ్మీ బ్రాండ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ తోనే టీవీ లను లాంచ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తొలిసారిగా రెడ్మీ సంస్థ, Amazon తో కలిసి Fire OS ని పరిచయం చేస్తోంది.

2022 లో Xiaomi బ్రాండ్ F2 Fire TV ని యూరప్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. Xiaomi F2 TV సిరీస్ 43, 50, 55-ఇంచ్ సైజెస్ లో వచ్చాయి. ఇవి Fire OS 7 పై పని చేస్తాయి. Fire OS 7 లో Apple AirPlay, Disney+, Amazon Prime Video, Netflix, YouTube వంటి యాప్స్ ఉంటాయి. ఈ కొత్త టీవీ లో 4కే డిస్ప్లే, 60హెర్ట్జ్ ప్యానెల్, హెచ్డీఆర్10/హెచ్ఎల్‌జీ కంటెంట్ సపోర్ట్, 2జిబి ర్యామ్, 16జిబి స్టోరేజీ, క్వాడ్-కోర్ చిప్సెట్, మాలి-జీ52 జీపీయూ ఉన్నాయి.

F2 సిరీస్ టీవీల్లో డ్యూయల్ 12 వాట్ స్పీకర్స్, డాల్బి ఆడియో, డీటీఎస్-హెచ్డీ సపోర్ట్ ఉన్నాయి. వై-ఫై సపోర్ట్, బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్, ఈథర్నెట్, రిమోట్ బిల్ట్-ఇన్ అలెక్సా వాయిస్ కంట్రోల్ ఈ టీవీ లో ఉన్నాయి. 43-ఇంచ్ టీవీ ధర 339 యూరోలు (సుమారు రూ.33,400), 50-ఇంచ్ టీవీ ధర 379 యూరోలు (సుమారు రూ.37,400), 55-ఇంచ్ టీవీ ధర 424 యూరోలు (సుమారు రూ.41,800) గా ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరూ.401 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea
Next articleGeekbench పై కనిపించిన Moto G Stylus (2023)
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.