Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి కొత్తగా Turbo సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా Redmi Turbo 3 డివైజ్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. రెడ్మీ టర్బో 3 లో స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 20ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ టర్బో 3 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Redmi Turbo 3 ధర
Redmi Turbo 3 స్మార్ట్ఫోన్ చైనాలో 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
రెడ్మీ టర్బో 3 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,044) గా ఉంది.
రెడ్మీ టర్బో 3 యొక్క 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,299 (సుమారు రూ.26,499) గా ఉంది.
రెడ్మీ టర్బో 3 యొక్క 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,499 (సుమారు రూ.29,349) గా ఉంది.
రెడ్మీ టర్బో 3 యొక్క 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర CNY 2,799 (సుమారు రూ.32,263) గా ఉంది.
Redmi Turbo 3 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Turbo 3 లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, అల్ట్రా-థిన్ బెజెల్స్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Turbo 3 లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హై క్లాక్ స్పీడ్ 3GHz.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Turbo 3 డివైజ్ 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ మొత్తం 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Redmi Turbo 3 లో 50ఎంపి సోని ఎల్వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Redmi Turbo 3 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: రెడ్మీ టర్బో 3 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: రెడ్మీ టర్బో 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ ఉన్నాయి.
