
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబాని, సంస్థ యొక్క 47వ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో కొన్ని భారీ ప్రకటనలు చేశారు. ప్రపంచంలోని 8 శాతం మొబైల్ ట్రాఫిక్స్ జియో వద్ద ఉందని ఆయన చెప్పారు. సరసమైన ధరలు ఉండటంతో, జియో సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు. 8 ఏళ్ళలో జియో సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా కంపెనీగా అవతరించిందని అన్నారు. ఏఐని అన్నిచోట్లా, అందరికీ అందించాలనే సంకల్పంతో, జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ముకేశ్ అంబాని ప్రకటించారు.
100జిబి ఉచిత క్లౌడ్ స్టోరేజీ
జియో యూజర్లకు 100జిబి ఉచిత క్లౌడ్ స్టోరేజీ అందించనున్నట్లు ముకేశ్ అంబాని తెలిపారు. ఈ ఉచిత స్టోరేజీతో యూజర్లు తమ ఫోటోలను, వీడియోలను, డాక్యుమెంట్లను మరియు ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కావాల్సినప్పుడల్లా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు, తక్కువ ధరలకే అధిక స్టోరేజీ ప్లాన్స్ కూడా అందించనున్నట్లు అంబాని తెలిపారు.
జియో 100జిబి ఉచిత క్లౌడ్ స్టోరేజీని దీపావళి సందర్భంగా జియో ఏ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ లో భాగంగా అందించనున్నట్లు అంబాని తెలియజేశారు.
జామ్‌నగర్‌లో గిగావాట్-స్కేల్, ఏఐ-రెడీ డేటా సెంటర్
యాన్యువల్ జనరల్ మీటింగ్ సందర్భంగా, రిలయన్స్ మరో కీలక ప్రకటన చేసింది. జామ్‌నగర్ లో గిగావాట్-స్కేల్, ఏఐ-రెడీ డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ముకేశ్ అంబాని తెలిపారు. ఏఐ సేవలనేవి అందరికీ అందుబాటులో ఉండాలని, అవి ఒక వర్గానికే పరిమితం కాకూడదని అంబాని అన్నారు.
అంబాని ప్రకారం, ఏఐ ప్రధానంగా నాలుగు రంగాలకు ప్రయోజనం అందించనుంది. అవి: అగ్రికల్చర్ – ఏఐ ఫార్మర్స్, ఎడ్యుకేషన్ – ఏఐ టీచర్స్, హెల్త్ కేర్ – ఏఐ డాక్టర్స్, చిన్న వ్యాపారాలు – ఏఐ వల్లన చిన్నపాటి వ్యాపారుల యొక్క శక్తి పెరుగుతుందని, వారు ముందుకు వెళ్ళేందుకు ఏఐ సాయపడుతుందని అంబాని అన్నారు.