Home News Reliance AGM 2022 తేదీ ప్రకటన: Jio 5G లాంచ్ అయ్యే అవకాశం

Reliance AGM 2022 తేదీ ప్రకటన: Jio 5G లాంచ్ అయ్యే అవకాశం

హైలైట్స్:

ఆగస్టు 29 న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 45 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పలు కీలకమైన ప్రకటన వెల్లడయ్యే అవకాశముందని అందరూ అంచనా వేస్తున్నారు. వీటిలో 5జీ నెట్వర్క్ రోలౌట్ ప్రకటన ప్రధానమైనది. గతేడాది 44 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో జియో ఫోన్ నెక్ట్స్ తో పాటు సోలార్, న్యూ ఎనర్జీ బిజినెస్ లను అనౌన్స్ చేసింది. ఈ ఏడాది 5జీ నెట్వర్క్ ప్రకటన ఉంటుందని సమాచారం. ఇటీవలె ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ పై భారీ పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.

రిలయన్స్ జియో యొక్క భవిష్యత్తు, రిలయన్స్ డిజిటల్, ఆయిల్, కెమికల్ యూనిట్ లకు సంబంధించిన ప్రకటనలు ఈ 45 వ రిలయన్స్ ఏజీఎం లో వెలువడవచ్చు. జియో ప్లాట్ఫామ్ ని సమీప భవిష్యత్తులో ఐపీవో కి తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇది వంద బిలియన్ డాలర్ల విలువ ఉంటుందని అంచనా.

Reliance Jio 5G, Jio Phone రానున్నాయా?

ఆగస్టు 29 న రిలయన్స్ సంస్థ 45 వ ఏజీఎం కాన్ఫరెన్స్ ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సదస్సులో 5జీ సేవలను పరిచయం చేయడమో లేదా 5జీ కి సంబంధించిన ప్రకటన రావడమో జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే తక్కువ ధరలో ఓ 5జీ ఫోన్ వచ్చే అవకాశముంది. మొత్తం 24.7 గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ కోసం జియో రూ.88,078 కోట్లు వెచ్చించింది. ఈ స్పెక్ట్రమ్ లో 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో దేశంలోని ప్రధాన నగరాల్లో తొలి దశ 5జీ సేవలు ప్రారంభమవుతాయని టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ రిపోర్ట్ లో భాగంగా, రిలయన్స్ కంపెనీ తన యొక్క 5జీ రోలౌట్ ప్లాన్స్ ని రివీల్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న 1000 నగరాల్లో 5జీ కవరేజీ ప్లానింగ్ పూర్తయిందని, తొలి దశలో 22 నగరాల్లో 5జీ నెట్వర్క్ ప్రారంభమవుతుందని రిలయన్ తెలిపింది. హీట్ మ్యాప్స్, 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ ద్వారా కవరేజీ ప్లానింగ్ ప్రథమంగా క్లైంట్ యూసేజ్, రెవెన్యూ సాధ్యాసాధ్యాలపై ఫోకస్ చేసింది. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ తక్కువ టవర్స్ ద్వారా మెరుగైన కవరేజీని అందిస్తుందని చెబుతున్నారు.

5జీ కాకుండా, 6జీ లో స్టాండర్డైజేషన్ కొరకు తమ రీసెర్చిని జియో స్పీడ్ అప్ చేసింది. ఇందుకోసం ఫిన్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఉలు తో జియో చేతులు కలిపింది. ప్రపంచంలో తొలి 6జీ రీసెర్చి ప్రోగ్రామ్ కి ఉలు యూనివర్శిటీ ఇంచార్జి గా వ్యవహరిస్తోంది.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.