Home News 120 కిలోమీటర్ల రేంజ్, రూ.1.25 లక్షల ధరతో లాంచైన River Indie ఎలక్ట్రిక్ స్కూటర్

120 కిలోమీటర్ల రేంజ్, రూ.1.25 లక్షల ధరతో లాంచైన River Indie ఎలక్ట్రిక్ స్కూటర్

Highlights
  • భారత్ లో లాంచైన River Indie ఎలక్ట్రిక్ స్కూటర్
  • ఫ్రంట్ ఫుల్‌పెగ్స్, 14-ఇంచ్ వీల్స్ తో వచ్చిన తొలి భారతీయ ఈ-స్కూటర్ River Indie
  • 4కిలోవాట్ అవర్ బ్యాటరీ, 120కేఎం రేంజ్ తో లాంచైన River Indie ఎలక్ట్రిక్ స్కూటర్

బెంగళూరుకి చెందిన స్టార్టప్ River భారత్ లో River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. 120 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.25 లక్షలుగా ఉంది. ఎక్స్‌ప్యాన్సివ్ స్టోరేజీ స్పేస్, పేనియర్ మౌంట్స్, ఫ్రంట్ ఫుట్‌పెగ్స్, క్రాష్ గార్డ్స్ వంటి ఫీచర్లు ఈ బండిలో ఉన్నాయి. River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ మాన్సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ ధర

భారత్ లో River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఇది బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధర. ప్రాంతాలను బట్టి ఇందులో మార్పు ఉండనుంది. అయితే, ఇది పరిచయ ధర మాత్రమే. తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది. 2023 ఆగస్టు నుంచి ఈ బండి డెలివరీలు మొదలవుతాయి. కంపెనీ యొక్క వెబ్ సైట్ ద్వారా River Indie బండిని రూ.1,250 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

River Indie స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ లో ట్విన్-బీమ్ ఫుల్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉంటాయి. బాడీ డిజైన్ విభిన్నంగా ఉండి స్కూటర్ కి ఆకర్షణని తీసుకొచ్చింది. స్మార్ట్ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ బండికి స్పోర్టీ లుక్ తీసుకొచ్చింది. క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్స్ బెటర్ హ్యాండ్లింగ్, స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి. సెగ్మెంట్ బెస్ట్ వైడెస్ట్ సీట్ ని అందించామని కంపెనీ చెబుతోంది.

River Indie లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్లు

River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6.7 కిలోవాట్ మోటర్ ని అందించారు. దీనికి 4 కిలోవాట్ అవర్ కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ని అనుసంధానించారు. 0 నుంచి 80 శాతం చార్జ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది. River Indie బండి ఇకో మోడ్ లో నడిపితే 120 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఈ బండి టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్.

River Indie ఈ-స్కూటర్ మూడు రైడింగ్ మోడ్స్ ని కలిగి ఉంది. అవి: ఇకో సెకండ్ రైడ్, థర్డ్ రష్ మోడ్. సమ్మర్ రెడ్, స్ప్రింగ్ యెల్లో, మాన్సూన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో River Indie బండి లభిస్తుంది. River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ లో 55 లీటర్ల స్పేస్ ఉంటుంది. అవి: 43 లీటర్ల బూట్ స్పేస్, 12 లీటర్ల గ్లవ్ బాక్స్ స్పేస్.

2023 ఆగస్టు నుంచి ఈ బండి డెలివరీలు మొదలవుతాయి. కంపెనీ యొక్క వెబ్ సైట్ ద్వారా River Indie బండిని రూ.1,250 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారత్ లో River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఇది బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధర. ప్రాంతాలను బట్టి ఇందులో మార్పు ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.