Home News Royal Enfield నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్: Electrik01

Royal Enfield నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్: Electrik01

హైలైట్స్

త్వరలో Royal Enfield సంస్థ ఒక ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయనుందన్న సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం సదరు సంస్థ ఆ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. ఈ తరుణంలో రాయల్ ఇన్‌ఫీల్ట్ యొక్క తొలి ఎలక్ట్రిక్ బైక్ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసింది. Electrik01 అనే పేరుతో ఓ కాన్సెప్ట్ మోడల్ పిక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. భవిష్యత్తులో Royal Enfield నుంచి వచ్చే ఈ-బైక్ డిజైన్ ఏ విధంగా ఉండనుందోనన్న విషయం ఈ కాన్సెప్ట్ బైక్ తో అర్థమవుతోంది.

Electrik01 కాన్సెప్ట్ మెషీన్

Electrik01 కాన్సెప్ట్ మెషీన్ లుక్ చూస్తే Royal Enfield కంపెనీ తనదైన శైలినే కొనసాగించినట్లు తెలుస్తోంది. ఎలిగంట్ బిల్డ్, రెట్రో-మోడర్న్ లుక్ తో చూసేందుకు ఆకర్షణీయంగా ఉంది. 1900 కాలం నాటి డిజైన్ ఎలిమెంట్స్ అయిన టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, Girder forks, Electrik01 కాన్సెప్ట్ వెహికిల్ పై కనిపిస్తున్నాయి. మరి ఈ బండిని ప్రొడక్షన్ లెవెల్ కి తీసుకెళ్తారా? అవకాశాలు ఉన్నాయనే అనుకుందాం.

Image courtesy: ACI

ఇక ప్రొడక్షన్ లెవెల్ కి వెళ్ళే సరికి టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ కాస్తా బ్యాటరీస్ ఉండే చోటుగా మారిపోతుంది. Girder fork సస్పెన్షన్ స్థానంలో మోడర్న్ యూఎస్‌డీ ఫోర్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా Electrik01 కాన్సెప్ట్ బైక్ ఆధారంగా రాయల్ ఇన్‌ఫీల్డ్ యొక్క తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇలా ఉంటుందేమోనన్న ఊహ మాత్రమే. అసలు ఈ కాన్సెప్ట్ బైక్ ఉత్పత్తి దశకు వెళ్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. వెళ్ళకపోతే గనుక ఇప్పుడు వేస్తున్న అంచనాలు మారనున్నాయి.

“గత 6 నుంచి 8 నెలల సమయంలో మేము ఎలక్ట్రిక్ వెహికిల్ రంగంలో పెట్టుబడులు పెట్టాం. ఈ సమయంలో వెహికిల్స్ ని పరీక్షించడం కోసం ఫిజికల్ ఇన్ఫాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నాం. మాకు భారత్ మరియు యూకే ల్లో ఉన్న టెక్నాలజీ సెంటర్స్ కోసం టాలెంట్ ఉన్న వారిని తీసుకుంటున్నాం. మొత్తం మీద మేం ఈవీ సెగ్మెంట్ పై గట్టిగా దృష్టి పెడుతున్నాం. ఇప్పటికే మోటర్ సైకిల్ తయారీలో పయనీర్ గా ఉన్న మేం మా పోటీదారుల కంటే ముందే ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయడం కష్టమైన పని కాదు. కానీ, మేం అలా అనుకోవడం లేదు. ముందుగా కొనుగోలుదారుల అవసరాలేంటో అర్థం చేసుకుంటున్నాం. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే ముందు వినియోగదారుడికి ఏం కావాలో క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాకే మా ఈ-బైక్స్ ని లాంచ్ చేస్తాం. ఎందుకంటే Royal Enfield అనేది కేవలం బండ్లతోనే కాదు మోటర్ సైక్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ని అందించడంలో కూడా పేరు పొందింది. విభిన్నమైన వాహన శ్రేణిని అందించడమే మా లక్ష్యం,” అని రాయల్ ఇన్‌ఫీల్డ్ సీఈవో గోవిందరాజన్ అన్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.