హైలైట్స్
- ఓటీటీ రిలీజ్ అడ్డంకులు తొలగడంతో స్ట్రీమింగ్ కి సిద్ధమైన ‘యశోద’
- యశోద ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో, డిసెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం
- యశోద చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సమంతా
ప్రముఖ నటి సమంతా నటించిన యశోద చిత్రం నవంబర్ 11 న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. శుభారంభం చేసిన ఈ సినిమా తర్వాత నెమ్మదించింది. మీడియం రేంజ్ సినిమాకి పబ్లిక్ టాక్ ఎంతో కీలకం. అయితే యశోద విషయంలో పబ్లిక్ టాక్ మిక్స్‌డ్ గా ఉండటంతో థియేటర్లలో ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. దీంతో వసూళ్ళు ఆశించిన రేంజ్ లో రాలేదు.
థియెట్రికల్ రన్ ముగిసిన వెంటనే చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే Eva IVF ఆస్పత్రి తో లీగల్ ఇష్యూ రావడంతో డిజిటల్ రిలీజ్ వాయిదా పడింది. యశోద సినిమాలో చూపించిన ఆస్పత్రి పేరు కూడా Eva నే కావడంతో చిక్కులు తప్పలేదు. చిత్రంలో చూపించిన ఆస్పత్రిని నెగటివ్ గా చూపించడంతో సదరు హాస్పటల్ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. దీంతో Eva ఆస్పత్రి యాజమాన్యం విషయాన్ని కోర్టుకి తీసుకెళ్ళింది.
తాజా పరిస్థితులను చూస్తే, ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఈ కేసు సాధారణమైన అవగాహన లోపం మరియు కోఇన్సిడెన్స్ గా పరిగణించబడింది. ఇప్పుడు ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరి కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో యశోద ఓటీటీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లైంది.
యశోద చిత్రం నవంబర్ 11 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ త్రిల్లర్ మూవీలో సమంతా ప్రధాన పాత్ర పోషించింది.
Amazon Prime Video లో స్ట్రీమ్ కానున్న యశోద
డిసెంబర్ 9 న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో యశోద చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో సమంతా ప్రధాన పాత్ర పోషించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, దివ్య శ్రీపాద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరి-హరీశ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శివలెంక కే ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
చిత్ర కథ
భారతదేశంలో కమర్షియల్ సరోగసీ (అద్దె గర్భం) ని ప్రభుత్వం నిషేధించింది. అయితే పేదింటి అమ్మాయిలకు డబ్బులను ఎరగా చూపి, ఓ ఆస్పత్రి అద్దె గర్భం దందాని రహస్యంగా నిర్వహిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న కథానాయిక దీనికి వ్యతిరేకంగా జరిపే పోరే చిత్ర కథ. సమంతా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సమంతా ఫైట్స్ కూడా చేయడం విశేషం. తన స్టంట్స్ తో సమంతా ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించింది. సమంతా ని అభిమానించే వారు, ఈ తరహా త్రిల్లర్స్ ని ఇష్టపడే వారు కచ్చితంగా సినిమాని చూడండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.