ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung మార్చి 4వ తేదీన భారతీయ మార్కెట్ లో Galaxy F15 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు Samsung Galaxy F15 5G డివైజ్ పై శాంసంగ్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy F15 5G ధర
Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ మోడల్ ధర రూ.12,999 గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది.
రూ.500 డిస్కౌంట్ తర్వాత 4జిబి ర్యామ్ మోడల్ రూ.12,499 కే లభించనుంది. 6జిబి ర్యామ్ వేరియంట్‌ని రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy F15 5G డివైజ్ లైట్ గ్రీన్, లైట్ వయొలెట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఆఫర్ 20 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఈ మధ్యలో కొన్న వారికి ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
ఆఫ్‌లైన్ మార్కెట్ లో ఈ ఆఫర్ అమలులోకి వచ్చింది. అంటే మొబైల్ షాపులు, శాంసంగ్ స్టోర్స్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ వద్ద Samsung Galaxy F15 5G పై డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం శాంసంగ్ వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్ లాంచ్ ధరకే విక్రయించబడుతోంది.
Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో 6.5-ఇంచ్ ఫుల్హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
