హైలైట్స్
- భారత్ లో లాంచైన Samsung Galaxy A04, Galaxy A04e
- మీడియాటెక్ హీలియో పీ35, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి ర్యామ్ తో లాంచైన ఫోన్లు
- Samsung Galaxy A04 ప్రారంభ ధర రూ.9,299, Galaxy A04e ప్రారంభ ధర రూ.11,999
భారత్ లో Samsung Galaxy A04, Galaxy A04e డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇవి ఏ-సిరీస్ లో ప్రవేశపెట్టబడిన చవకైన ఫోన్లు. Samsung Galaxy A04, Galaxy A04e స్మార్ట్ ఫోన్స్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వచ్చాయి. బ్యాక్ ప్యానెల్ పైన సర్క్యులర్ రింగ్స్ లో రెండు కెమెరాలు ఉంటాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంటుంది. రెండు ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదు. అంటే యూజర్లు ప్యాటెర్న్ లేదా పిన్ లాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
Samsung Galaxy A04, Galaxy A04e ఫోన్లు మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Samsung Galaxy A04, Galaxy A04e ధర, విక్రయం
Samsung Galaxy A04e ఫోన్ 3జిబి + 32జిబి వేరియంట్ ధర రూ.9,299 గా ఉంది. 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999, 4జిబి + 128జిబి యూనిట్ ధర రూ.11,499 గా ఉంది. ఈ ఫోన్ లైట్ బ్లూ మరియు కాపర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A04 ఫోన్ 4జిబి + 64జిబి యూనిట్ ధర రూ.11,999 గా ఉంది. ఇక 4జిబి + 128జిబి మోడల్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లైట్ బ్లూ మరియు కాపర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఈ రెండు ఫోన్లు శాంసంగ్ వెబ్ సైట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా డిసెంబర్ 20 నుంచి అందుబాటులోకి వస్తాయి.
Samsung Galaxy A04e, Galaxy A04 స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A04e మరియు Galaxy A04 ఫోన్లలో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1560*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, ఐఎంజీ పవర్ వీఆర్ జీఈ8320 జీపీయూ ఉంటాయి.
Samsung Galaxy A04e 3జిబి ర్యామ్ + 32జిబి/64జిబి స్టోరేజీ,4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
Samsung Galaxy A04 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.
రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. Samsung Galaxy A04e లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 4జి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్+గ్లొనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.
Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
మరోవైపు Samsung Galaxy A04 డివైజ్ 164.4 మిల్లీ మీటర్ల పొడవు, 76.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.
Samsung Galaxy A04e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి.
Samsung Galaxy A04 లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.