
ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే తక్కువ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A05, Samsung Galaxy A05s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. వచ్చే వారం భారత్ లో లాంచ్ కానున్నాయని సమాచారం. రూ.15,000 వద్ద ఈ రెండు ఫోన్ల ధర ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy A05, Galaxy A05s వివరాలు (లీక్)
- టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ఈ రెండు ఫోన్ల వివరాలను షేర్ చేశారు.
- వచ్చే వారం Samsung Galaxy A05, Samsung Galaxy A05s ఫోన్లు లాంచ్ అవుతాయని అభిషేక్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
- Samsung Galaxy A05 ధర రూ.13,000 ఉంటుందని, Samsung Galaxy A05s డివైజ్ ధర రూ.15,000 ఉంటుందని అభిషేర్ అంచనా వేశారు.
- రెండు ఫోన్లు కూడా 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందనున్నట్లు సమాచారం.
- ఈ ఫోన్లు అడాప్టర్ తో రావడం లేదని అభిషేక్ తన పోస్ట్ లో తెలిపారు.
- ఇంకా ఈ రెండు డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ని అభిషేక్ షేర్ చేశారు.
Exclusive ✨
Samsung Galaxy A05 & A05s launching next week in India.
? No adapter in box ❌
? 6.7" FHD+ Display (A05s)
90Hz refresh rate (A05s)
? 5000mAh battery
? Android 13 One UI 5.1 core
Price (2 major Android update and 4 years of security patches update)Price ?… pic.twitter.com/TAvLDQ0NRS
— Abhishek Yadav (@yabhishekhd) October 7, 2023
Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- మెమొరీ: Samsung Galaxy A05s లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 2 ఏళ్ళ వ్యారంటీని అందిస్తోంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్ 2గిగాహెర్ట్జ్ గరిష్ట క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- మెమొరీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.











