ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా రెండు కొత్త ఫోన్లను ఏ-సిరీస్ లో లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A05, Samsung Galaxy A05s. ఈ రెండు ఫోన్లు కూడా మలేషియాలో లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరోవైపు Samsung Galaxy A05s డివైజ్ లో 6జిబి ర్యామ్, 13ఎంపి సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ అందించారు. సరే, ఓసారి రెండు ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A05 ధర
Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే ఈ డివైజ్ ధరను కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే ధరకి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్ 2గిగాహెర్ట్జ్ గరిష్ట క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- మెమొరీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Samsung Galaxy A05s ధర
Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రూ.14,000 నుంచి రూ.16,000 మధ్య ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. మలేషియాలో ఈ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- మెమొరీ: Samsung Galaxy A05s లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 2 ఏళ్ళ వ్యారంటీని అందిస్తోంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
