
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఏ-సిరీస్ లో రాబోయే ఈ ఫోన్లు Samsung Galaxy A05, Samsung Galaxy A05s అనే పేర్లతో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలిసాయి. త్వరలోనే ఈ డివైజెస్ మార్కెట్ లోకి లాంచ్ కానున్నాయని సమాచారం. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A05 ధర (లీక్)
Samsung Galaxy A05 డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. ఇది తక్కువ బడ్జెట్ తో వస్తోంది. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. Samsung Galaxy A05s ధర భారత్ లో రూ.13,999 ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం.
Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంటాయి.
- కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ప్రాసెసర్: Samsung Galaxy A05 లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడనున్నారు. ఈ చిప్సెట్ పేరు, దీని గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఇంకా తెలియదు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A05 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A05 ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 5, బ్లూటూత్ 5.2 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
- కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A05 డివైజ్ బ్లాక్, సిల్వర్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A05s ధర (లీక్)
Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ లో ఒక కెమెరా సెన్సర్ ఎక్కువగా ఇచ్చారు. కానీ, ధర మాత్రం Samsung Galaxy A05 పోల్చితే తక్కువగానే ఉంటుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.12,999 ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.
Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఇన్ఫినిటీ యు కటౌట్ ఉంటుంది.
- కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
- ప్రాసెసర్: Samsung Galaxy A05s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: Samsung Galaxy A05s లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటాయి.
- ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉంటాయి.











