Home News భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A05 ధర

భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A05 ధర

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A05
  • లాంచ్‌కి ముందు లీకైన డివైజ్ ధర
  • Samsung Galaxy A05 ధర రూ.12,499

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A05 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ కి ముందు ఈ ఫోన్ ధర లీక్ అయ్యింది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే ఎక్స్-ప్లాట్ఫామ్ పై ఓ పోస్ట్ ద్వారా Samsung Galaxy A05 డివైజ్ ధరను రివీల్ చేశారు. దీంతో అతి త్వరలో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. రీసెంట్ గా భారత్ లో Samsung Galaxy A05s డివైజ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy A05 లాంచ్ కి రెడీ అవుతోంది.

ఇప్పటికే మలేషియా మరియు ఫిలిప్పైన్స్ దేశాల్లో Samsung Galaxy A05, Samsung Galaxy A05s లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A05s మాత్రమే భారత్ లో లాంచ్ అయ్యిందని ఇదివరకే మనం చెప్పుకున్నాం. సరే, ఓసారి Samsung Galaxy A05 ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 ధర

టిప్‌స్టర్ సుదాన్శు పోస్ట్ ప్రకారం, భారత్ లో Samsung Galaxy A05 డివైజ్ యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉండనుంది. మరోవైపు, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్