
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారత్ లో Galaxy A05s డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. Samsung Galaxy A05s హ్యాండ్సెట్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. లాంచ్ సమయంలోనే ధర, సేల్ వివరాలు తెలియనున్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A05s లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy A05s ఇండియా లాంచ్ తేదీ
- Samsung Galaxy A05s డివైజ్ అక్టోబర్ 18 న లాంచ్ అవుతోంది. ఈ హ్యాండ్సెట్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. టీజర్ ఇమేజ్ ద్వారా ఫోన్ యొక్క పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది.
- డిజైన్ ఎలా ఉందో చూస్తే, Samsung Galaxy A05s డివైజ్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, కాస్త మందపాటి బెజెల్స్ ఉన్నాయి.
- వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
- సిమ్ ట్రే ఫోన్ కి ఎడమవైపున ఉంది.
- బ్యాక్ ప్యానెల్ విషయానికి వస్తే, Samsung Galaxy A05s బ్యాక్ ప్యానెల్ పై ఒక ఎల్ఈడీ ఫ్లాష్, ట్రిపుల్ కెమెరాలు, శాంసంగ్ లోగో ఉన్నాయి.
Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ఉంటుంది. అంటే ఈ ఫోన్ 5జీ నెట్వర్క్ సపోర్ట్ తో రావడం లేదు.
- మెమొరీ: Samsung Galaxy A05s లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 6జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
- కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











