ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తాజాగా తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ Samsung Galaxy A05s ధరను తగ్గించింది. శాంసంగ్ బడ్జెట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. Samsung Galaxy A05s ధరపై రూ.2,000 ను శాంసంగ్ సంస్థ తగ్గించింది. అసలైతే, Samsung Galaxy A05s ఫోన్ గతేడాది నవంబర్ నెలలో లాంచ్ అయ్యింది. శాంసంగ్ యొక్క అధికార వెబ్సైట్ లో Samsung Galaxy A05s ఫోన్ తక్కువ ధరకి లభిస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A05s కొత్త ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A05s కొత్త ధర
- Samsung Galaxy A05s స్మార్ట్ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర కంపెనీ వెబ్సైట్ లో రూ.11,499 గా ఉంది. ఈ మోడల్ రూ.13,499 ధరతో లాంచ్ అయ్యింది. అంటే ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ ఇస్తున్నారు.
- Samsung Galaxy A05s హ్యాండ్సెట్ లైట్ వయొలెట్, లైట్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16 మిలియన్ కలర్ డెప్త్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: Samsung Galaxy A05s డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.
- సాఫ్ట్వేర్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14, 15 అప్గ్రేడ్స్ తో పాటు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని పొందుతుంది.
- కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A05s డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇవ్వబడింది.
- సెక్యూరిటీ: Samsung Galaxy A05s స్మార్ట్ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్ ఫీచర్ అందించారు.
- చుట్టుకొలత, బరువు: Samsung Galaxy A05s డివైజ్ 168.0 మి.మీ పొడవు, 77.8 మి.మీ వెడల్పు, 8.8 మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ 2.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- ఆడియో: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ అందించారు.
- కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A05s డివైజ్ లైట్ గ్రీన్, లైట్ వయొలెట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
