Home News Samsung Galaxy A06: మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ06

Samsung Galaxy A06: మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ06

Highlights
  • వియత్నాంలో Samsung Galaxy A06 లాంచ్
  • 6.7-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఏ-సిరీస్ లో ఒక చవకైన ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A06 పేరుతో వచ్చిన ఈ డివైజ్ వియత్నాంలో లాంచ్ అయ్యింది. గత మోడల్ Samsung Galaxy A05 తో పోల్చితే Samsung Galaxy A06 లో చిన్న చిన్న మార్పులు మాత్రమే చేయడం జరిగింది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే తో వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy A06 ధర, లభ్యత

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను తెలుసుకుందాం.

Samsung Galaxy A06 యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర VND 31,90,000 (సుమారు రూ.10,675) గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను VND 37,90,000 (సుమారు రూ.12,682) గా పెట్టారు.

వచ్చే వారం నుంచి Samsung Galaxy A06 సేల్ మొదలవుతుంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య ఈ ఫోన్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ఉచితంగా 25 వాట్ చార్జర్ లభిస్తుంది. ఇకపోతే, భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే శాంసంగ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A06 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A06 లో 6.7-ఇంచ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. గత మోడల్ ఏ05 లో 60 హెర్ట్జ్ డిస్ప్లే ఇచ్చారు.

ప్రాసెసర్: Samsung Galaxy A06 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A06 డివైజ్ 64జిబి/128జిబి స్టోరేజీ, 4జిబి/6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A06 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ సెన్సర్ ఉంటాయి.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A06 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A06 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A06 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.