
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారతీయ మార్కెట్ ధర వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Samsung Galaxy A06 భారత మార్కెట్ ధర (లీక్)
Samsung Galaxy A06 స్మార్ట్‌పోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ కానుంది. లీకైన ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 ఉంటుంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.
Samsung Galaxy A06 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A06 లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే ఉంది. ఇది హెచ్డీ+ ఇన్ఫినిటీ యు-నాచ్ డిజైన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంది.
ప్రాసెసర్: Samsung Galaxy A06 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ వాడారు.
కెమెరా: Samsung Galaxy A06 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
కనెక్టివిటీ: Samsung Galaxy A06 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy A06 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
Samsung Galaxy A06 వియత్నాం మార్కెట్ ధర
Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను తెలుసుకుందాం.
Samsung Galaxy A06 యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర VND 31,90,000 (సుమారు రూ.10,675) గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను VND 37,90,000 (సుమారు రూ.12,682) గా పెట్టారు.











