ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ అనే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A06 బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు
బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ పై SMA065M, SM-A065M/DS, SM-A065F/DS అనే మోడల్ నంబర్ కనిపించాయి. దీంతో త్వరలో శాంసంగ్ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు స్పష్టమవుతోంది.
డేటాబేస్ లో Samsung Galaxy A06 యొక్క ఇమేజ్ కూడా కనిపించింది. దీంతో డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది.
Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ 4జీ కనెక్టివిటీ, 15 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా ఖరారైంది.
Samsung Galaxy A06 డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ పై SM-A065F/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
ఇప్పుడు గత మోడల్ Samsung Galaxy A05 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఈ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.
కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
