హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్
- SM-A145R/DSN అనే మోడల్ నంబర్ తో FCC సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A14 4G
- టీయూవీ రెయిన్‌ల్యాండ్ మరియు యూఎల్ డెమ్కో ప్లాట్ఫామ్స్ పై కూడా కనిపించిన డివైజ్

SM-A145R/DSN అనే మోడల్ నంబర్ తో Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ FCC సర్టిఫికేషన్ పొందింది. ఈ విషయాన్ని 91మొబైల్స్ గుర్తించింది. ఇదే ప్లాట్ఫామ్ పై Samsung Galaxy A14 5G డివైజ్ ప్రత్యక్షమైన వారం రోజులకు Samsung Galaxy A14 4G కూడా కనిపించింది. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy A14 4G యొక్క 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, బ్లూటూత్ మరియు డ్యూయల్-బ్యాండ్ వై-ఫై కనెక్టివిటీ గురించి తెలిసింది. Samsung Galaxy A14 4G డివైజ్ ఇంకా రెయిన్ ల్యాండ్ మరియు యూఎల్ డెమ్కో ప్లాట్ఫామ్స్ పై కూడా కనిపించింది.
FCC సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ EP-T1510 అనే మోడల్ నంబర్ కలిగిన చార్జింగ్ అడాప్టర్ ని కలిగి ఉంది. ఇక ఫోన్ యొక్క అసలైన డిజైన్ ఎలా ఉంటుందో ఇంకా తెలియలేదు. ఔట్‌లైన్ ని బట్టి, ఈ ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 11.8 మిల్లీ మీటర్ల మందం ఉంటుందని తెలుస్తోంది.
Samsung Galaxy A14 4G బ్యాటరీ స్పెసిఫికేషన్స్
టీయూవీ రెయిన్ ల్యాండ్ సర్టిఫికేషన్ ద్వారా Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ 4900 ఎంఏహెచ్ బ్యాటరీ (5000ఎంఏహెచ్ కెపాసిటీ), 15 వాట్ చార్జింగ్ స్పీడ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది మినహా టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా ఇంకా ఏమీ రివీల్ కాలేదు. ఇక యూఎల్ డెమ్కో లిస్టింగ్ లో బ్యాటరీ మోడల్ నంబర్ HQ-50SD అని ఉంది. ఈ రెండు ప్లాట్ఫామ్స్ ద్వారా రివీల్ అయిన వివరాలు ఇంతే. కానీ, రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలుస్తాయి.
4జీ వేరియంట్‌తో పాటు, శాంసంగ్ కంపెనీ 5జీ వేరియంట్ Samsung Galaxy A14 పై కూడా పని చేస్తోంది. రీసెంట్ గా ఈ మోడల్ కంపెనీ యొక్క ఇండియా సపోర్ట్ పేజీలో కనిపించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని స్పష్టమైంది. 5జీ వర్షన్ SM-A146B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. 5జీ వర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో రానున్నట్లు సమాచారం. Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ శ్రేణి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్న డివైజ్. ఈ ఫోన్ నార్మల్ డెయిలీ యూజర్ అవసరాలను తీర్చేదిగా ఉంటుంది. ఈ ఫోన్ ధర కూడా సామాన్యుడు కొనుగోలు చేసే విధంగా ఉండనుంది. త్వరలోనే ధర, ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











