హైలైట్స్
- యూఎస్ మరియు యురోపియన్ మార్కెట్స్ లో లాంచైన Samsung Galaxy A14 5G
- గెలాక్సీ ఏ13 5జీ కి సక్సెసర్ గా వచ్చిన Samsung Galaxy A14 5G, త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్న డివైజ్
- మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చిన Samsung Galaxy A14 5G
పెద్దగా హడావుడి లేకుండా ప్రముఖ సంస్థ శాంసంగ్ Samsung Galaxy A14 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్. గెలాక్సీ ఏ13 5జీ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. ఏ13 తో పోల్చితే Samsung Galaxy A14 5G లో పలు అప్‌గ్రేడ్స్ చేశారు. త్వరలోనే ఈ డివైజ్ ని శాంసంగ్ భారత్ లో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఫోనన్ యూఎస్ మరియు కొన్ని యూరోపియన్ మార్కెట్స్ లో అందుబాటులో ఉంది.
Samsung Galaxy A14 5G ఫోన్ ప్లాస్టిక్ పాలికార్బొనేట్ బ్యాక్ మరియు ప్రేమ్ తో వస్తోంది. ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ ని ఫోన్ కలిగి ఉంది. ఈ డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై కెమెరాల కోసం 3 సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. ఒకసారి Samsung Galaxy A14 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A14 5G ధర, స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A14 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజీతో వచ్చింది. మరొకటి 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో వచ్చింది. యూఎస్ లో బేస్ వేరియంట్ ధర 200 డాలర్లు (సుమారు రూ.16,000) గా ఉండగా, యూరోప్ లో బేస్ వేరియంట్ ధర 229 యూరోలు (సుమారు రూ.20,100) గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్, డార్క్ రెడ్ మరియు లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, న్యారో బెజెల్స్, మందపాటి చిన్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
Samsung Galaxy A14 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సింగిల్ చార్జ్ పై ఈ ఫోన్ అడాప్టివ్ పవర్-సేవింగ్ టెక్నాలజీ ద్వారా 3 రోజుల పాటు పని చేస్తుందని కంపెనీ చెబుతోంది.
Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. వీటికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ ఫోన్ లో అల్ట్రావైడ్ లెన్స్ లేదు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కోర్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీ ఇస్తోంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి. వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. Samsung Galaxy A14 5G ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 204 మిల్లీ మీటర్ల బరువు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.