Home News లీకైన Samsung Galaxy A14 డిజైన్

లీకైన Samsung Galaxy A14 డిజైన్

హైలైట్స్

Samsung కంపెనీ రీసెంట్ గా Galaxy A04e స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు వివిధ మార్కెట్స్ లో లాంచ్ అవ్వనుందని సమాచారం. 2023 లో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే గెలాక్సీ ఏ-సిరీస్ లో శాంసంగ్ త్వరలోనే Samsung Galaxy A14 అనే ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ ఏ13 కి సక్సెసర్ గా ఏ14 వస్తోంది. శాంసంగ్ ఏ13 ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో భారత్ లో లాంచ్ అయ్యింది.

Samsung Galaxy A14 కి సంబంధించిన వివరాలను శాంసంగ్ అధికారికంగా వెల్లడించలేదు. అయితే తాజాగా ఓ రిపోర్ట్ ద్వారా Samsung Galaxy A14 యొక్క డిజైన్ బయటకు వచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే ఈ రెండర్స్ ని లీక్ చేశాడు. మరి Samsung Galaxy A14 యొక్క డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

లీకైన Samsung Galaxy A14 డిజైన్ రెండర్స్

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్. Samsung Galaxy A14 ధర భారత్ లో రూ.15,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తున్నట్లు లీకైన డిజైన్ రెండర్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

ఈ 5జీ స్మార్ట్ ఫోన్ వాటర్ డ్రాప్ డిజైన్ ని కలిగి ఉంది. స్క్రీన్ సన్నని బెజెల్స్, మందపాటి చిన్ ని కలిగి ఉంది. Samsung Galaxy A14 5G డివైజ్ కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పవర్ బటన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా నిక్షిప్తమై ఉంటుంది.

Samsung Galaxy A14 లో 3.5 ఎంఎం ఆడియో జాక్ బాటమ్ లో ఉంది. ఈ ఆడియో జాక్ పక్కన యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. గ్రీన్ కలర్ ఆప్షన్ లో Samsung Galaxy A14 కనిపిస్తోంది. మరిన్ని రంగుల్లో కూడా ఈ ఫోన్ లభ్యం కానుంది. వీటిలో వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి.

Samsung Galaxy A14 రీసెంట్ గా వై-ఫై అలియన్స్ వెబ్ సైట్ లో కనిపించింది. ఆ కథనం ద్వారా ఈ ఫోన్ 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు తెలిసింది.

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా, రెండు 2ఎంపి సెన్సర్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.