Home News ఈరోజే Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫస్ట్ సేల్

ఈరోజే Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫస్ట్ సేల్

Highlights
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Samsung Galaxy A14 5G
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చిన Galaxy A23 5G
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న Galaxy A14, Galaxy A23

శాంసంగ్ రీసెంట్ గా రెండు కొత్త మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. అవే Samsung Galaxy A23 5G, Galaxy A14 5G. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా పలు కీలకమైన అప్‌గ్రేడ్స్ తో వచ్చాయి. లాంచ్ అయిన కొన్ని రోజులకే, ఈ ఫోన్లు భారత్ లో సేల్ కి వచ్చాయి.

శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఈ డివైజెస్ ని శాంసంగ్.కామ్ ద్వారా మరియు ఇతర ఆన్‌లైన్ సైట్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. నేడు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు మొదలవుతాయి.

Galaxy A14 5G, Galaxy A23 5G ఫోన్ల కొనుగోలు పై లాంచ్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ కార్డ్స్ లేదా జెస్ట్ మనీ ట్రాన్స్‌సాక్షన్స్ పై రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ల ధరలు

Galaxy A14 ఫోన్ భారత్ లో మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ14 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.20,999. కార్డ్ ఆఫర్స్ ద్వారా రూ.1500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Samsung Galaxy A23 5G ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా నిర్ణయించారు. ఇది 8జిబి + 128జిబి వేరియంట్ లో కూడా లభిస్తుంది. దీని ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. Samsung Galaxy A23 5G లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A23 5G లో స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. ఇందులో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇందులో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇందులో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy A23 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కోర్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.