
Samsung Galaxy A15 డివైజ్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ మోడల్స్ లో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క యురోపియన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A15 యొక్క డిజైన్ మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A15 డిజైన్
- రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A15 4G, 5G యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానున్నట్లు తెలుస్తోంది.
- ఫోన్ కి ఫ్రంట్ చూస్తే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. ఫోన్ ఫ్లాట్ కార్నర్స్, బెజెల్స్ కనిపిస్తున్నాయి.
- Samsung Galaxy A15 4G, 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. బాటమ్ లో శాంసంగ్ లోగో ఉంది.
- ఫోన్ కి కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్ ఉన్నాయి.
- Samsung Galaxy A15 4G మరియు 5G వేరియంట్స్ దాదాపుగా ఒకే రకమైన డిజైన్ ని కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A15 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A15 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయి. 4జీ వేరియంట్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A15 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 4జీ, 5జీ వేరియంట్స్ 128జిబి స్టోరేజీ, 8జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
- కెమెరా: Samsung Galaxy A15 5జీ వేరియంట్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక Samsung Galaxy A15 4జీ వేరియంట్ లో 48ఎంపి మెయిన్ కెమెరా+8ఎంపి+5ఎంపి సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: Samsung Galaxy A15 4జీ మరియు 5జీ మోడల్స్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి.











