
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung వియత్నాంలో Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలో భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. రెండు ఫోన్లలో ప్రాసెసర్, స్టోరేజీల్లో మార్పులు తప్పా మిగతాదంతా ఒకే విధంగా ఉంటుంది. సరే, ఓసారి Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A15 5G, 4G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A15 5G మరియు 4G మోడల్స్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ యు డిస్ప్లే, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. మరోవైపు Samsung Galaxy A15 4G మోడల్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G, 4జీ వేరియంట్స్ 8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తాయి. స్టోరేజీ విషయానికి వస్తే, Samsung Galaxy A15 5G డివైజ్ 256జిబి స్టోరేజీ తో వచ్చింది. 4జీ మోడల్ 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- ఇతర ఫీచర్లు: ఈ రెండు శాంసంగ్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.











