Samsung తన 5G స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మొబైల్‌ను రాబోయే రోజుల్లో Samsung Galaxy A15 5G పేరుతో విడుదల చేయవచ్చని సమాచారం. కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, దీనికి సంబంధించి కొత్త లీక్‌లు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈలోపు Samsung Galaxy A15 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A15 5G ధర (లీక్)
Samsung Galaxy A15 5G
6.5” FHD+ display 90hz
50 MP triple rear camera with 10x zoom, 5MP, 2MP
Up to 128 GB internal storag expandable to 1 TB
13 MP front camera
Side Fingerprint sensor
5,000 mAh / 25W
MT6835 / DM6100+
Android 13
4GB/6GB
Black/Blue$149
— Paras Guglani (@passionategeekz) October 28, 2023
- టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా Samsung Galaxy A15 5G ధరను రివీల్ చేశారు.
- Samsung Galaxy A15 5G డివైజ్ 149 డాలర్లు (సుమారు రూ.12,403) గా ఉండవచ్చు.
- శాంసంగ్ సంస్థ ఈ కొత్త ఫోన్ ని రెండు స్టోరేజీల్లో ఆఫర్ చేస్తుంది. అవి: 4జిబి మరియు 6జిబి ర్యామ్.
- లీకైన అంచనా ధర బేస్ వేరియంట్ అయిన 4జిబి+64జిబి మోడల్‌ది అయ్యుంటుందని భావిస్తున్నారు.
Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ రిజిడ్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో రానుందని ఇటీవలె ఒక లీక్ ద్వారా తెలిసింది.
- ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: Samsung Galaxy A15 5G లో 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
