
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే ఒక చవకైన ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A15 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి వస్తోంది. ఇటీవలె ఈ డివైజ్ ఇమేజ్ రెండర్ రివీల్ అయ్యింది. తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై Samsung Galaxy A15 కనిపించింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A15 డివైజ్ గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A15 గీక్‌బెంచ్ లిస్టింగ్
- Samsung Galaxy A15 డివైజ్ గీక్ బెంచ్ పై SM-A155F అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
- Samsung Galaxy A15 డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 743 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 2005 పాయింట్లు స్కోర్ చేసింది.
- ముఖ్యమైన ఫీచర్లను చూస్తే, Samsung Galaxy A15 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ తో కనిపించింది.
- Samsung Galaxy A15 డివైజ్ 4జిబి ర్యామ్ తో గీక్ బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
- Samsung Galaxy A15 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు సమాచారం.
- తక్కువ ధరలో 4జీ టెక్నాలజీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Samsung Galaxy A15 లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్/120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A15 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది.
- మెమొరీ: Samsung Galaxy A15 లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్ వేరియంట్స్ ఉండే అవకాశం ఉంది.
- కెమెరా: Samsung Galaxy A15 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A15 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
- సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A15 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











