ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే బడ్జెట్ సెగ్మెంట్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఈ క్రమంలో Samsung Galaxy A15 అనే ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇది గత మోడల్ Samsung Galaxy A14 కి సక్సెసర్ గా వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ద్వారా Samsung Galaxy A15 డివైజ్ యొక్క ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి లీకైన Samsung Galaxy A15 రెండర్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
లీకైన Samsung Galaxy A15 ఇమేజెస్
- టిప్‌స్టర్ ఎవన్ బ్లాస్ Samsung కొత్త ఫోన్ యొక్క ఇమేజ్ ని X ప్లాట్‌ఫామ్ పై షేర్ చేశారు.
- ఈ ఇమేజ్ Samsung Galaxy A15 అయ్యుంటుందని సమాచారం.
- లీకైన ఇమేజ్ లో బ్యాక్ ప్యానెల్ పూర్తిగా కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- అయితే, కెమెరా లెన్స్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
- Samsung Galaxy A15 లో కుడివైపున వాల్యూమ్ బటన్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందని తెలుస్తోంది.
- ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ ఉంది. Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు. రానున్న రోజుల్లో స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు, గత మోడల్ Samsung Galaxy A14 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Samsung Galaxy A14 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A14 డివైజ్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
- చిప్సెట్: Samsung Galaxy A14 లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ వాడారు. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- మెమొరీ: Samsung Galaxy A14 లో 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
- కెమెరా: Samsung Galaxy A14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy A14 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
- ఓఎస్: Samsung Galaxy A14 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A14 లో 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
