
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా గ్లోబల్ మార్కెట్ లో కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇకపోతే, ఈ ఫోన్ 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్ తో రావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ భారీ అమోలెడ్ స్క్రీన్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క డిజైన్, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy A16 5G డిజైన్
Samsung Galaxy A16 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంది. ఫోన్ కి ఫ్రంట్ లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఫ్లాట్ ప్యానెల్ అందించారు. ఈ ఫోన్ 7.9 మందం ఉంటుంది. డివైజ్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి.
Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ బ్లాక్, లైట్ గ్రే, గోల్డ్ మరియు లైట్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A16 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A16 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A16 5G డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. మార్కెట్స్‌ను బట్టి వేరియంట్స్ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1.5టిబి వరకు పెంచుకునే వీలుంది.
కెమెరా: Samsung Galaxy A16 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A16 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది యూఎస్బీ టైప్-సీ 2.0 పోర్ట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
కనెక్టివిటీ: Samsung Galaxy A16 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G డివైజ్ లో ఐపీ54 రెసిస్టన్స్ రేటింగ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి.
Samsung Galaxy A16 5G ధర
Samsung Galaxy A16 5G డివైజ్ శాంసంగ్ డచ్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. కానీ ధర వెల్లడి కాలేదు. అయితే, రూ.15,000 లోపు ఈ ఫోన్ ధర ఉంటుందని అంచనా వేయవచ్చు.











