
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ శాంసంగ్ అధికార వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది. సరే, ఓసారి సపోర్ట్ పేజీ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy A16 5G ఇండియా సపోర్ట్ పేజీ లిస్టింగ్
Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఇండియా వెబ్సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ SM-A166/DS అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. ఈ నంబర్ చివర్లో ఉన్న డీఎస్ అనే అక్షరాలు, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ను సూచిస్తున్నాయి.
ఇదే మోడల్ నంబర్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ లో కూడా కనిపించింది. దీన్ని బట్టి త్వరలోనే Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది.
భారత్ లో Samsung Galaxy A16 5G యొక్క సపోర్ట్ పేజీ శాంసంగ్ వెబ్సైట్ పై దర్శనమిస్తుండటంతో, త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని స్పష్టమవుతోంది. అయితే కచ్చితమైన తేదీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Samsung Galaxy A16 5G డిజైన్
గతంలో లీకైన సమాచారం ప్రకారం, Samsung Galaxy A16 5G డివైజ్ లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని తెలిసింది.
Samsung Galaxy A16 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, అద్దం లాంటి ప్రీమియమ్ గ్లాస్ డిజైన్ ఉంటాయి. ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్స్ ఉంటాయి. ఫ్రంట్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ గత మోడల్ కంటే సన్నగా ఉండవచ్చు.
Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: Samsung Galaxy A16 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ యు స్క్రీన్, ఫుల్హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A16 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్/మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటాయి. ఇండియన్ వేరియంట్ డైమెన్సిటీ 6300 చిప్ తో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A16 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.
సాఫ్ట్వేర్: Samsung Galaxy A16 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 6 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
బరువు, చుట్టుకొలత: Samsung Galaxy A16 5G డివైజ్ 164.4 మి.మీ పొడవు, 77.9 మి.మీ వెడల్పు, 7.9 మి.మీ మందం, 192/200 గ్రాముల బరువు ఉంటుంది.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G డివైజ్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.












