హైలైట్స్
- జపనీస్ మార్కెట్ లో Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన శాంసంగ్
- గ్లోబల్ వర్షన్ ఫోన్ కి జపనీస్ మోడల్ కి మధ్య ఎన్నో తేడాలు
- 5.8-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, టీఎఫ్‌టీ ఎల్సీడీ ప్యానెల్, ఐపీ68 రేటింగ్ తో వచ్చిన Samsung Galaxy A23 5G జపనీస్ వేరియంట్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా జపనీస్ మార్కెట్ లో Samsung Galaxy A23 5G అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. గ్లోబల్ గా లాంచ్ అయిన ఏ23 5జీ కి జపనీస్ మోడల్ కి చాలా తేడాలున్నాయి. Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 4జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. Samsung Galaxy A23 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A23 5G స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 5.8-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1560*720 పిక్సెల్ రెజుల్యూషన్, టీఎఫ్‌టీ ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది. ఫోన్ కి మూడు వైపులా బెజెల్స్ లేవు. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. స్క్రీన్ టాప్ లో వి-షేప్డ్ నాచ్ ఉంది. Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 150 మిల్లీ మీటర్ల పొడవు, 71 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.0 మిల్లీ మీటర్ల మందం, 168 మిల్లీ మీటర్ల బరువు ఉంటుంది.
Samsung Galaxy A23 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత, వన్‌యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తో వచ్చింది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ శాంసంగ్ డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1 టెరాబైట్ వరకు పెంచుకోవచ్చు.
Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై 50 మెగా పిక్సెల్ సెన్సర్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాస్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్‌ప్రూఫ్ రేటింగ్ తో వస్తోంది.
Samsung Galaxy A23 5G ఫోన్ ఈ-సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ డివైజ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ తో వస్తోంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
Samsung Galaxy A23 5G ధర
Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర 32,800 యన్ లు (సుమారు రూ.17,000). ఈ ఫోన్ రెడ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ తో జపనీస్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.