Home News లాంచ్ అయిన Samsung Galaxy A23 5G

లాంచ్ అయిన Samsung Galaxy A23 5G

హైలైట్స్:

శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ ని పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేసింది శాంసంగ్ సంస్థ. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి క్వాడ్ కెమెరా, 6.6 అంగుళాల ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ కలిగి ఉంది. అయితే ఫోన్ యొక్క ధర, భారత్ లో లభ్యత పై శాంసంగ్ ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. అయితే, ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అమర్చారు. ఆండ్రాయిడ్-12 ఆధారిత వన్ యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. మరి శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ ఇంకా ఏ ఫీచర్లను కలిగి ఉందో ఇక్కడ చూద్దాం పదండి.

Samsung Galaxy A23 5G ప్రధాన స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లేని కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్లో ఏ ప్రాసెసర్ వాడారో తెలియదు. అయితే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉండే అవకాశముందని అంచనా. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4జిబి+64జిబి, 6జిబి+128జిబి, 8జిబి+128జిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ దొరుకుతుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్ ఫోన్లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండటం విశేషం.

హ్యాండ్సెట్ బరువు 197 గ్రాములు. వైట్, పింక్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. అయితే, ఇంకా అఫీషియల్ మార్కెటింగ్ పేర్లు శాంసంగ్ అనౌన్స్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్, జియోమాగ్నెటిక్, సెన్సర్, గ్రిప్ సెన్సర్, జైరో సెన్సర్, యాక్సలరోమీటర్, వర్చువల్ లైటింగ్ సెన్సర్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సర్ వంటి సెన్సర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Samsung Galaxy A23 5G అంచనా ధర

దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ అయిన శాంసంగ్ ఇంకా ఈ ఫోన్ కి సంబంధించిన ధర, లభ్యత ను గురించి వివరాలను వెల్లడించలేదు. గతేడాది జులై 2020 లో గెలాక్సీ ఏ22 5జీ లాంచ్ అయిన విషయం తెలిసిందే. దీని ధర ఆధారంగా ఏ23 5జీ ధరను అంచనా వేయగలం. ఏ22 5జీ ధర రూ.19,999 నుంచి రూ.21,999 వరకు ఉంది. దీన్ని బట్టి శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ధర కూడా ఇలాగే ఉండే అవకాశముందని చెప్పవచ్చు.