ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఏ-సిరీస్ లో Galaxy A24 డివైజ్ ని లాంచ్ చేయనుందని వార్తలు వినిపించాయి. నేడు, ఈ ఫోన్ అఫీషియల్ గా జనాల ముందుకు వచ్చింది. శాంసంగ్ సంస్థ Galaxy A24 డివైజ్ ని వియత్నాంలో లాంచ్ చేసింది. ఈ డివైజ్ 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Galaxy A24 డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్
- 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- సూపర్ అమోలెడ్ ప్యానెల్
Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వచ్చింది. ఈ ఫోన్ స్క్రీన్ సూపర్ అమోలెడ్ ప్యానెల్ పై తయారైంది. డిస్ప్లే బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో చిన్ కనిపిస్తోంది. యు షేప్ లో ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంది.
- 8జిబి ర్యామ్ + 128జిబి మెమొరీ
- 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం ఈ ఫోన్ లో 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. కచ్చితమైన చిప్సెట్ వివరాలు ఇంకా అందలేదు. Samsung Galaxy A24 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 13ఎంపి సెల్ఫీ కెమెరా
Samsung Galaxy A24 లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- 3.5ఎంఎం ఆడియో జాక్
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
Samsung Galaxy A24 ఫోన్ ఒక 4జీ డివైజ్. డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 3.5ఎంఎం ఆడియోజాక్ ఉంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
Samsung Galaxy A24 వేరియంట్స్ మరియు ధర
Samsung Galaxy A24 డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో వచ్చింది. ఇందులో బేస్ మోడల్ 6జిబి ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది. ప్రస్తుతానికి Samsung Galaxy A24 ధర ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
