శాంసంగ్ సంస్థ త్వరలోనే Samsung Galaxy A24 డివైజ్ ని లాంచ్ చేయనుందని ఇటీవల మార్కెట్ లో చర్చలు జరుగుతున్నాయి. 4జీ కనెక్టివిటీతో రానున్న ఈ డివైజ్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ కానుంది. ఇక Samsung Galaxy A24 కి సంబంధించిన అధికార ప్రకటన వస్తుందనుకుంటోన్న తరుణంలో, ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A24 ధర
Samsung Galaxy A24 డివైజ్ లేటెస్ట్ లీక్ ని The Tech Outlook వెబ్ సైట్ షేర్ చేసింది. రిపోర్ట్ ప్రకారం, ఈ శాంసంగ్ ఫోన్ 190 యూఎస్ డాలర్ల ధరతో లాంచ్ కానున్నట్లు సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.16 వేలుగా ఉండనుంది. లీక్ గనుక నిజమే అయితే, Samsung Galaxy A24 డివైజ్ మార్కెట్ లోకి ఏప్రిల్ నెలలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
- 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ప్యానెల్
- 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- ఆండ్రాయిడ్ 13ఓఎస్
- మీడియాటెక్ హీలియో జీ99 చిప్
- 50ఎంపి రియర్ కెమెరా
- 13ఎంపి సెల్ఫీ కెమెరా
- 15 వాట్ చార్జింగ్
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్, 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో లాంచ్ అవుతుందని రిపోర్ట్ లో పేర్కొనబడింది. అలాగే ఈ స్క్రీన్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైందని, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం.
Samsung Galaxy A24 4G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వస్తున్నట్లు నివేదికలో పేర్కొనబడింది.
Samsung Galaxy A24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుందని లీకైన రిపోర్ట్ ని బట్టి అర్థమవుతోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Samsung Galaxy A24 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఉండే అవకాశం ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఈ శాంసంగ్ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది. అలాగే ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉండే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
