Home News 48MP OIS కెమెరా, Exynos 7904 ప్రాసెసర్ తో వస్తోన్న Samsung Galaxy A24

48MP OIS కెమెరా, Exynos 7904 ప్రాసెసర్ తో వస్తోన్న Samsung Galaxy A24

హైలైట్స్

రానున్న కొన్ని నెలల్లో Samsung సంస్థ Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఏ23 కి ఇది సక్సెసర్ గా వస్తోంది. The Pixel ద్వారా Samsung Galaxy A24 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారాన్ని బట్టి Samsung Galaxy A24 లో 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 48ఎంపి ఓఐఎస్ కెమెరాతో వస్తున్నట్లు స్పష్టమైంది.

Samsung Galaxy A24 ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. ఈ డివైజ్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy A24 యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుందని సమాచారం. ఏ23 తో పోల్చితే ఇది భారీ మార్పేనని చెప్పాలి. శాంసంగ్ గెలాక్సీ ఏ23 లో కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. కానీ, అది ఎల్సీడీ ప్యానెల్. ఇకపోతే Samsung Galaxy A24 లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందా లేదా డాట్-నాచ్ డిస్ప్లే ఉంటుందా అనే విషయం ఇంకా తెలియదు.

అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం లాంచ్ అయిన Exynos 7904 ప్రాసెసర్ ని Samsung Galaxy A24 లో వాడనున్నట్లు సమాచారం. ఈ చిప్ 14nm FinFET ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ71 జీపీయూ వాడటం జరిగింది. గెలాక్సీ ఎమ్20, ఎమ్30, ఏ40 వంటి ఎన్నో స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ ఎగ్జినోస్ 7904 చిప్సెట్ ని వాడింది.

Samsung Galaxy A24 కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. Samsung Galaxy A24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని వినికిడి. ఇందులో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ లెన్స్ ఉండనుంది. ఓఐఎస్ ని తీసుకురావడం ఏ23 తో పోల్చితే బిగ్ అప్‌గ్రేడ్ అని చెప్పాలి. అలాగే ఇందులో 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి ఆగ్జిలరీ లెన్స్ ఉండనున్నాయి. అయితే, Samsung Galaxy A24 లో మ్యాక్రో లెన్స్ ఉండబోదని గతంలో వచ్చిన ఓ వార్త స్పష్టం చేసింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరా ఉండనుంది.

Samsung Galaxy A24 లో 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే, బ్యాటరీ మరియు చార్జింగ్ స్పీడ్ కి సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. Samsung Galaxy A23 లో 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. కావున, Samsung Galaxy A24 లో కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లభ్యం కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో Samsung Galaxy A24 కి సంబంధించిన కచ్చితమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.