ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. తాజాగా ఒక లీక్ ద్వారా Samsung Galaxy A25 5G కి సంబంధించిన లాంచ్ తేదీ, ధర మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. భారత్ లో ఈ ఫోన్ ధర లో-బడ్జెట్ లోనే ఉండనుంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A25 5G లాంచ్ తేదీ, ధర, సేల్ తేదీ (లీక్)
- WinFuture రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A25 5G డివైజ్ స్విట్జర్లాండ్ లో డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 19 మధ్య సేల్ కి వచ్చే అవకాశం ఉంది.
- ధర విషయానికి వస్తే, Samsung Galaxy A25 5G డివైజ్ ధర 279 స్విస్ ఫ్రాన్సిస్ (సుమారు రూ.26,315) ఉంటుందని సమాచారం.
- Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క జర్మనీ మార్కెట్ ధరని గమనిస్తే, 269 నుంచి 289 యూరోలు (సుమారు రూ.24,563 నుంచి రూ.26,390) గా ఉండే అవకాశం ఉంది.
- భారత మార్కెట్ లాంచ్ టైమ్‌లైన్, ధర వివరాలు ఇంకా రివీల్ కాలేదు. కానీ, త్వరలోనే గ్లోబల్ మరియు ఇండియా లాంచ్‌ని కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.
Samsung Galaxy A25 5G డిజైన్ (లీక్)
- Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ గ్రిడ్ వంటి ప్యాటర్న్ గల బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంటుందని ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
- Samsung Galaxy A25 5G డివైజ్ కి ముందు వైపు చూస్తే, ఇన్ఫినిటీ-యు నాచ్ డిస్ప్లే ఉంది.
- Samsung Galaxy A25 5G రియర్ ప్యానెల్ గమనిస్తే, ట్రిపుల్ రియర్ కెమెరా కనిపిస్తోంది. ఇది గతంలో రివీలైన డిజైన్ మాదిరే ఉంది.
- Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంటుంది.
- కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
